సూర్యాపేట జిల్లాలో కరోనా కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. ఎవరూ ఊహించనివిధంగా ఈ ఒక్కరోజే 16 మందికి వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 39కి చేరింది. తాజాగా నమోదైన కేసుల్లో 8 మంది చొప్పున మహిళలు, పురుషులు ఉన్నారు.
ఈనెల 11న నమోదైన 11 పాజిటివ్ కేసుల్లో సూర్యాపేట పాతమార్కెట్లో నివసించే 4 కుటుంబాలకు చెందిన 8 మంది ఉన్నారు. తాజాగా వెలుగుచూసిన కేసుల్లో 14 మంది ఆయా కుటుంబాలకు చెందినవారే ఉన్నట్లు వైద్యఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు.
కాగ ఇప్పటివరకూ తెలంగాణ 700 కేసులు నమోదు కాగా, 18మంది మృతి చెందినట్లు మంత్రి ఈటెల తెలిపారు. ఇప్పటివరకూ కరోనా బారిన పడి కోలుకుని 186మంది డిశ్చార్జ్ అయ్యారని , ఇవాళ 68మంది డిశ్చార్జ్ కాగా, ఎవరూ చనిపోలేదన్నారు.