టీమ్ ఇండియా క్రికెటర్.. చెన్నై సూపర్‌కింగ్స్ ఆటగాడు సురేశ్‌రైనాను ముంబయ్ పోలీసులు సోమవారం రాత్రి అరెస్ట్ చేశారు. ముంబయ్ విమానాశ్రయం సమీపంలోని ఓ పబ్‌లో రైనాను అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. కరోనా నియమాలు పాటించకపోవడంతో పాటు నిబంధనలకు విరుద్ధంగా పబ్ నిర్వహిస్తున్నారనే సమచారంతో దాడులు చేసినట్టు పోలీసులు చెప్పుకొచ్చారు.
రైనాతో పాటు పబ్‌లో ఉన్న మరో 34 మందిని కూడా అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించిన తర్వాత బెయిల్‌పై విడుదల చేసినట్టు సమాచారం. ఇక సురేష్ రైనా విషయానికి వస్తే…ఈ ఏడాది ఆగస్టు 15న అంతర్జాతీయ క్రికెట్‌కు రైనా గుడ్‌బై చెప్పాడు. మిత్రుడు, టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ రిటైర్మెంట్ ప్రకటించిన అరగంటలోనే రైనా కూడా అదే బాట పట్టడం గమనార్హం.