ఆ 22,885 కోట్ల లెక్క చెప్పండి !

Supreme Court warns Sahara22,885 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయో వివరాలు చెప్పాలని సహారా సంస్థకు సుప్రీంకోర్టు హెచ్చరించింది. వివరాలు వెల్లడించని పక్షంలో సీబీఐ, కంపెనీల రిజిస్ట్రారుల విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. న్యాయస్థానం నిస్సహాయంగా ఉందని అనుకో వద్దని, తమ హెచ్చరికలను తేలిగ్గా తీసుకోవద్దని, ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పకపోయినా.. విచారణ సంస్థల ద్వారా తాము తెలుసుకోగలమని కేఎస్ రాధాకృష్ణన్, జేఎస్ ఖేహార్ లతో కూడిన ధర్మాసనం పేర్కొంది.