Site icon TeluguMirchi.com

ఆధార్‌ అనుసంధానంపై సుప్రీం కీలక తీర్పు

ఆధార్‌తో మొబైల్ నంబ‌ర్‌, బ్యాంక్ అకౌంట్‌ల అనుసంధానం డెడ్‌లైన్‌ను నిర‌వ‌ధికంగా పొడిగించింది సుప్రీంకోర్టు. దీనిపై ఏర్పాటు చేసిన ఐదుగురు స‌భ్యుల రాజ్యాంగ ధ‌ర్మాస‌నం తుది తీర్పును వెలువ‌రించే వ‌ర‌కు డెడ్‌లైన్ అంటూ ఏమీ ఉండ‌ద‌ని స్ప‌ష్టంచేసింది

ఈ మేరకు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్రా నేతృత్వంలోని ఐదుగురు సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం మంగళవారం ఈ తీర్పు వెలువరించింది.

పలు సంక్షేమ పథకాలు, సేవలకు ఆధార్‌ అనుసంధానాన్ని తప్పనిసరి చేస్తూ గతేడాది కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే దీనిపై కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆధార్‌ అనుసంధానం విశ్వసనీయం కాదని పేర్కొంటూ పిటిషన్లు దాఖలు చేశారు. ఈ విషయంపై తాజాగా మరోసారి విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. ఆధార్‌ గడువును నిరవధికంగా పొడగించింది.

Exit mobile version