డ్యాన్స్ బార్లకు సుప్రీం గ్రీన్ సిగ్నల్ !

Supreme Court lifts ban on barముంబైలో డాన్స్ బార్లు తిరిగి ప్రారంభించడానికి సుప్రీంకోర్టు అనుమతించింది. బార్లలో డ్యాన్సులపై నిషేధం విధిస్తూ.. 2005లో ముంబై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ నిర్ణయాన్ని బాంబే హైకోర్టు సైతం సమర్థించింది. దీంతో.. తాము ఉపాధి కోల్పోతున్నామని మహిళా డ్యాన్సర్లు పిటిషన్ ను దాఖలు చేశారు. తాజాగా, ఈ పిటిషన్ ను విచారించిన న్యాయస్థానమ్ ముంభైలో డాన్స్ బార్లకు అనుమతినిచ్చింది. సుప్రీం తాజా తీర్పుతో.. ముంభైలోని బార్లు మళ్లీ అతివల నృత్యాలతో హోరెత్తనున్నాయి.