క్షమాభిక్ష’ పై సుప్రీంకోర్టు కీలక తీర్పు

Supreme Court commutes 15 death sentencesఉరికంబానికి అడుగు దూరంలో నిలిచి నిత్య నరకం అనుభవిస్తున్న కరుడు గట్టిన నేరస్థులకు ఊరటనిచ్చే ఒక సంచలనాత్మకమైన తీర్పును సుప్రీంకోర్టు వెలువరించింది. ఉరిశిక్ష పడ్డ నేరస్థుడు క్షమాభిక్ష కోసం చేసుకున్న వినతిపై నిర్ణయం తీసుకోవడంలో ప్రభుత్వం ఆలస్యం చేస్తే మరణశిక్షను యావజ్జీవ కారాగార శిక్షగా మార్చాల్సి ఉంటుందని ధర్మాసనం స్పష్టం చేసింది. చందనం దొంగ వీరప్పన్‌కు చెందిన నలుగురు సహాయకులతోసహా 15మంది ఖైదీలకు విధించిన మరణశిక్షను యావజ్జీవ కారాగార శిక్షగా మారుస్తూ సుప్రీం ఈ తీర్పు ఇచ్చింది. వీరిలో రాజీవ్‌ గాంధీ హత్య కేసు నిందితులు కూడా ఉన్నారు. సుప్రీం తీర్పుతో రాజీవ్‌ హంతకులు మురుగన్, శాంతన్, పెరిరవలన్‌లు, నలుగురు వీరప్పన్ అనుచరులు, పంజాబ్ మాజీ సీఎం బియాంత్ సింగ్ హత్య కేసులో నిందితుడు దేవీందర్‌ పాల్‌ సింగ్ భుల్లార్‌లు ఉరి శిక్ష నుంచి తప్పించుకున్నారు.