Site icon TeluguMirchi.com

నరేన్ హాట్రిక్ !

Narine's-hat-trickకోల్ కతా నైట్ రైడర్స్ మిస్టరీ స్పిన్నర్ సునీల్ నరైన్ హ్యాట్రిక్ సాధించాడు. మొహాలీలో ఈరోజు(మంగళవారం) కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తో మ్యాచ్ లో నరైన్ వరుసగా మూడు బంతుల్లో మూడు వికెట్లు తీసి ఐపీఎల్-6 సీజన్ లో హ్యాట్రిక్ సాధించిన తొలి బౌలర్ గా రికార్డు సాధించాడు. ఇన్నింగ్స్ 15వ ఓవర్ చివరి మూడు బంతులకు డేవిడ్ హసీ (12), అజర్ మహమూద్ (0), గురుకీరత్ సింగ్ (0) లను పెవిలియన్ చేర్చాడు. భారీ స్కోర్ దిశగా సాగుతున్న కింగ్స్ పంజాబ్ నరేన్ దెబ్బకు తొమ్మిది వికెట్లు కోల్పోయి 157  పరుగులు మాత్రమే చేయగలిగింది.

Exit mobile version