యాపిల్ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్… ప్రపంచం మొత్తం లో ఈ పేరు తెలియనివారుండరు. ప్రస్తుత స్మార్ట్ ఫోన్ రంగంలో యాపిల్ సంస్థకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. స్టీవ్ జాబ్స్ ముందు ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తూ యాపిల్ కంపెనీ స్థాపనకు ప్రయత్నించాడు. అమెరికాలోని పోర్ట్‌ల్యాండ్‌కు చెందిన రీడ్ కళాశాల నుంచి బయటకు వచ్చిన తరవాత ఉద్యోగం కోసం ఓ కంపెనీలో చేరాడు. కంప్యూటర్ డిజైన్ టెక్నీషియన్‌తో పాటు ఇంగ్లీషు లిటరేచర్ నైఫుణ్యతలుగా దరఖాస్తులో తెలిపారు స్టీవ్ జాబ్స్.
ఈ తొలి దరఖాస్తు ఇప్పుడు వేలంపాటలో భారీ ధరకు అమ్నడుపోయింది. 1973లో చేసిన ఈ దరఖాస్తును ప్రముఖ సంస్థ ఛార్టర్ ఫీల్డ్స్ వేలం వేయగా స్టీవ్ జాబ్స్ తన చేతిలో రాసిన ఉద్యోగ దరఖాస్తు 1.6 కోట్లకు అమ్ముడుపోయి రికార్డు సృష్టించింది. ఈ ఏడాది ఫిబ్రవరి 24వ తేదీన ప్రారంభమైన బిడ్డింగ్ మార్చ్ 24న ముగిసింది.1974లో అటారీ కంపెనీలో ఉద్యోగం చేసిన స్టీవ్ జాబ్స్, యాపిల్ సహ వ్యవస్థాపకుడైన స్టీవ్ వోజ్నియాక్‌ను కలిశారు. ఇద్దరూ కలిసి 1976లో కాలిఫోర్నియాలోని లాస్ ఆల్టోస్‌లో జాబ్స్ గ్యారేజిలో యాపిల్ సంస్థ ను ప్రారంభించారు. 2011లో స్టీవ్ జాబ్స్ కేన్సర్ కారణంగా మరణించారు.