Site icon TeluguMirchi.com

శ్రీరాముడి భక్తులు కొరకు “‘శ్రీరామాయణ ఎక్స్ ప్రెస్ “

ఇండియన్ రైల్వేస్ శ్రీరాముడి భక్తులు కోసం రామాయణం లో ఉన్న కొన్ని ముఖ్యమైన ప్రదేశాలను సందిర్శించడానికి ‘శ్రీరామాయణ ఎక్స్ ప్రెస్’ పేరుతో ఒక యాత్ర రైలును నడపనున్నట్లు రైల్వే మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఈ రైలును నవంబర్ 14 వ తేదీన ఢిల్లీ లోని సఫ్దర్జంగ్ స్టేషన్ నుండి ప్రారంభించనున్నారు. ఈ రైల్ యూపీలోని అయోధ్య లో మొదట ఆగుతుంది. అక్కడ హనుమాన్ గర్హి రామకోటి మరియు కనక్ భవన్ టెంపుల్ సందర్శన తరువాత అక్కడ నుంచి నందిగ్రామ్, సీతామర్హి, వారణాసి, ప్రయాగ, శ్రీనగవేర్పూర్, చిత్రకూట్, హంపి, నాసిక్ మీదుగా రామేశ్వరం చేరుతుంది.

ఈ టూర్ కు వెళ్లాలంటే ఒక్కో ప్రయాణికుడి నుంచి రూ.15,120 ( పదిహేనువేల నూటఇరవై రూపాయలు ) వసూలు చేస్తారు. ప్రయాణికులకు భోజన, వసతి సదుపాయాలు కూడా ఈ ప్యాకేజిలోనే కల్పింస్తుంది. ఈ రామాయణ యాత్ర 16 రోజులు పాటు కొనసాగుతుంది. ఈ రైల్ లో 800 సీట్లు ప్రయాణికులు కోసం అందుబాటులో ఉంటాయి.

రామాయణం లో మరో ముఖ్య ప్రదేశం శ్రీలంక. అక్కడ క్యాండీ, నువారా ఎలియా, కొలంబో, నెగోంబో అనే కొన్ని ముఖ్యమైన ప్రదేశాల సందర్శన కోసం ప్రత్యేక ఛార్జీలను రైల్వే శాఖ వసూలు చేస్తుంది. శ్రీలంక లోని ఆయా ప్రాంతాలను చూడాలనుకునే వారు చెన్నై నుంచి కొలంబోకు విమానంలో ప్రయాణించాల్సి ఉంటుంది.
దీనికోసం IRCTC లో ప్రస్తుతం 5-రాత్రిలు / 6-పగల శ్రీలంక పర్యటనకు ప్యాకేజీ రూ .36,970 నుంచి ప్రారంభమవుతుంది. శ్రీ రామాయణ యాత్ర ఆన్లైన్ బుకింగ్ కొరకు www.irctctourism.com లో త్వరలో రైల్వే ప్రవేశపెట్టనుంది.

Exit mobile version