దక్షిణ మధ్య రైల్వే సరికొత్త రూల్


పంజాబ్‌లోని అమృత్‌సర్‌ సమీపంలో ఇటీవల జరిగిన ప్రమాదం నేపథ్యంలో రైల్వేశాఖ సరికొత్త రూల్ తీసుకొచ్చింది. రోజు రోజుకు పెరిగిపోతున్న రైల్వే ప్రమాదాలను అరికట్టే చర్యలో భాగంగా దక్షిణ మధ్య రైల్వే ఇక నుంచి రైలు పట్టాలు దాటినా, ట్రాక్‌పైకి వచ్చినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. నిబంధనలు ఉల్లంఘిస్తే రైల్వే చట్టాల ప్రకారం 6 నెలల వరకు జైలు శిక్ష తో పాటు రూ.1000 జరిమానా విధించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటనలో పేర్కొంది.

నిబంధనలు :

* రైల్వే స్టేషన్లలో పాదచారుల వంతెనల ద్వారా ట్రాక్‌కు ఒకవైపు నుంచి మరోవైపు వెళ్లాలి
* ఇతరచోట్ల సబ్‌వేలు, రోడ్‌అండర్‌బ్రిడ్జిలు, రైల్వేక్రాసింగ్‌ల ద్వారా దాటాలి
* రైల్వేట్రాక్‌ సమీపంలోను, రైలు ఎక్కేటప్పుడు గానీ మొబైల్ వాడకూడదు.
* రైల్వే ట్రాక్‌పై, సమీపంలో సెల్ఫీలు దిగడం నిషేదం.
* ట్రాక్‌ సమీపంలో ఎలాంటి కార్యక్రమాలూ చేపట్టకూడదు