లాక్ డౌన్ ఎఫెక్ట్ : 24 రైళ్లను రద్దుచేసిన దక్షిణ మధ్య రైల్వే

కరోనా నేపథ్యంలో పలు రాష్ట్రాలలో లాక్ డౌన్ అమలవుతున్న సంగతి తెలిసిందే. ప్రయాణికుల రద్దీలేని కారణంగా జూన్ 1 నుంచి 16వ తేదీ వరకు పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఆ రైళ్ల వివరాలను వెల్లడించింది. ప్రయాణికులకు కలుగుతున్న అసౌకర్యానికి చింతిస్తున్నామని, ఈ విషయాన్ని ప్రయాణికులు గమనించాలని రైల్వే శాఖ కోరింది.

రద్దు చేసిన రైళ్ల వివరాలు:

1.గూడూరు-విజయవాడ, 2.విజయవాడ-గూడూరు, 3.గుంటూరు-వికారాబాద్, 4. వికారాబాద్-గుంటూరు, 5. విజయవాడ-సికింద్రాబాద్, 6. సికింద్రాబాద్-విజయవాడ, 7. బీదర్-హైదరాబాద్, 8. సికింద్రాబాద్-బీదర్, 9.హైదరాబాద్-సిర్పూర్ కాగజ్‌ నగర్, 10. సిర్పూర్‌ కాగజ్ నగర్ -సికింద్రాబాద్, 11. సికింద్రాబాద్-కర్నూల్ సిటీ, 12. కర్నూల్ సిటీ-సికింద్రాబాద్, 13. సికింద్రాబాద్-సిర్పూర్‌ కాగజ్ నగర్, 14. సిర్పూర్ కాగజ్ నగర్ -సికింద్రాబాద్, 15. నర్సాపూర్-నిడుదవోలు, 16.నిడుదవోలు-నర్సాపూర్, 17. గుంటూరు-కాచిగూడ, 18.కాచిగూడ-గుంటూరు, 19. ఆదిలాబాద్-హెచ్.ఎస్.నాందేడ్, 20. హెచ్.ఎస్.నాందేడ్-ఆదిలాబాద్, 21. పర్బని-హెచ్.ఎస్.నాందేడ్, 22. ఎం.జీ.ఆర్.చెన్నయ్ సెంట్రల్-తిరుపతి, 23.విజయవాడ-ఎం.జీ.ఆర్.చెన్నయ్ సెంట్రల్, 24. తిరుపతి-ఎం.జీ.ఆర్.చెన్నయ్ సెంట్రల్‌