సోలార్‌ ఇంపల్స్‌ కొత్త రికార్డ్ !

solar-impulseఎలాంటి విద్యుత్తు వినియోగించకుండా సౌరశక్తితో రాత్రీ, పగలూ ప్రయాణించే అత్యాధునిక విమానం సోలార్‌ ఇంపల్స్‌. ఇది తన రెండవ ప్రయాణాన్ని తిరిగి ఆరంభించింది. ఇప్పటికే తొలిసారి 1,116 కిలోమీటర్లు ప్రయాణించిన ఈ విమానం తన రెండవ యాత్రను బుధవారం నాడు అమెరికా ఖండం నుండి ఆరంభించింది. అరిజోనాలోని ఫీనిక్స్‌ విమానాశ్రయం నుండి టెక్సాస్‌లోని డల్లాస్‌కు ఈ విమానం బయలుదేరింది. ఈ రెండింటి మధ్య దూరం సుమారుగా 1,300 కిలోమీటర్లు. ఈ యాత్ర పూర్తయితే సౌర విమాన చరిత్రలో సోలార్‌ ఇంపల్స్‌ సరికొత్త రికార్డు సృష్టించనుంది. ఈ విమానం రాత్రయ్యేసరికి 8,230 మీటర్ల ఎత్తుకు చేరుకుని అక్కడినుండి మెల్లిగా కిందికి దిగుతూ తెల్లవారి సూర్యకిరణాలు తాకేంతవరకు అసలు ఎలాంటి విద్యుత్తును వినియోగించుకోకుండా ప్రయాణిస్తుంది.