చొక్కాలో దూరిన పాము.. వీడియో చూస్తే భయంతో చావాల్సిందే !


సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. వాటిలో కొన్ని ఫన్నీగా నవ్వు తెప్పించేలా ఉంటే కొన్ని మాత్రం భయపెట్టేలా ఉంటాయి. వాటిని చూస్తే పై ప్రాణాలు పైనే పోతాయి. అలాంటి వీడియోనే ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఈ వీడియో చూస్తే కొన్ని క్షణాల పాటు ఏమవుతుందో అన్న భయంతో గుండె ఆగటం ఖాయం. అసలేం జరిగిందంటే చల్లని చెట్టు నీడలో ఓ వ్యక్తి నిద్రపోతూ ఉంటాడు. ఇంతలో అతని పొట్టపై ఏదో పాకినట్లు అనిపించడంతో మెలుకవవచ్చి చూస్తాడు. ఒక పాము తన చొక్కాకు ఉన్న బటన్ల మధ్యలో నుంచి తన పొట్టలోకి దూరినట్టు చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు. కానీ అరవకుండా చాలా ఓపికతో చూస్తూ ఉంటాడు.

ఇంతలో అటు పక్కగా వెళుతున్న కొందరు అతనిని గమనించి అరవవద్దని చెబుతారు. అలాగే అతను నెమ్మదిగా ఒక్కొక్క బటన్ విప్పుతూ ఉంటే పాము కొంచెం బయటకు వస్తుంది. అయితే దాని తల మాత్రం షర్ట్ లోపలే ఉంటుంది. మళ్లీ ఏం జరుగుతుందా అని టెన్షన్.. అయితే ఆ వ్యక్తి చాలా చాకచక్యంగా కొంచెం పక్కకు జరిగి పాము బయటకు వెళ్లడానికి దారి ఇస్తాడు. దీంతో పాము అతనికి ఏ హాని చేయకుండా వచ్చిన దారినే వెళ్లిపోతుంది. దీంతో ప్రాణాపాయం నుంచి బయటపడినందుకు ఆ వ్యక్తితో పాటు మిగిలిన వారు కూడా ఊపిరి పీల్చుకున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో చూసి తాగి ఎక్కడపడితే అక్కడ పడిపోతే ఇలా జరుగుతుంది అని కొందరు కామెంట్ చేస్తుంటే.. లక్ ఉండబట్టే బతికిపోయాడంటూ మరికొందరు కామెంట్ చేస్తున్నారు.