Site icon TeluguMirchi.com

జపాన్ ఓపెన్ రెండో రౌండ్ లో సింధు !

sindhuభారత బ్యాడ్మింటన్ యువ సంచలనం సింధు జపాన్ ఓపెన్ లో రెండో రౌండుకు చేరుకుంది. టోక్యోలో ఈ రోజు జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో సింధు స్థానిక షట్లర్ యుకినో నకాయ్ పై 21-12, 21-13 తో సునాయాసంగా గెలుపొందింది. సింధు రెండో రౌండ్లో జపాన్ క్వాలిఫయర్ అకానె యమగూచితో తలపడనుంది. మరోవైపు, ఈ టోర్నీలో సింధుతో పాటు మరో తెలుగు ఆటగాడు శ్రీకాంత్ కూడా రెండో రౌండ్ కి చేరుకున్నాడు. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో శ్రీకాంత్ ప్రపంచ 22వ ర్యాంకర్, జపాన్ ఆటగాడైన షొ ససాకిపై 22-20, 22-24, 21-18 తో గెలుపొందాడు.

Exit mobile version