ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి వణికిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మహాహమారి దెబ్బ కు చిన్న , పెద్ద, పేద, ధనిక అనే తేడాలు లేకుండా అందరూ చనిపోతున్నారు. తాజాగా పద్మశ్రీ అవార్డు గ్రహీత, గుర్బానీ గాయకుడు నిర్మల్ సింగ్ (62) గురువారం ఉదయం తుది శ్వాస విడిచారు. నిర్మల్ సింగ్ ఈమధ్యనే విదేశాల నుంచి పంజాబ్‌కు వచ్చాడు.
మార్చి 30వ తేదీన ఆయనకు శ్వాస సంబంధ సమస్యలు తలెత్తాయి. దీంతో అతన్ని ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించగా, కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. నిన్న సాయంత్రం నిర్మల్ సింగ్‌కు వెంటిలేటర్‌పై చికిత్స అందించారు. చికిత్స కొనసాగుతుండగానే ఇవాళ ఉదయం 4:30 గంటలకు నిర్మల్ సింగ్ మృతి చెందారు.