తమ దేశంలో కరోనా వైరస్‌ను నియంత్రించడానికి భారత్ సాయం చేయాలంటూ పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ విన్నవించాడు. ప్రస్తుతం పాకిస్తాన్ విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటుందని, కరోనా వైరస్ బారిన పడిన బాధితులకు చికిత్స అందించేందుకు తగినన్ని వెంటిలేటర్లు కూడా లేవన్నాడు. ఈ విషయంలో తమను భారత్ ఆదుకోవాలని విజ్ఞప్తి చేశాడు. అదే సమయంలో భారత్-పాకిస్తాన్‌ల మధ్య వన్డే సిరీస్ జరపాలను ప్రతిపాదనను కూడా అక్తర్ తీసుకొచ్చాడు. ప్రస్తుతం భారత్‌తో పాటు పాకిస్తాన్‌లోనూ కరోనా ప్రభావం తీవ్ర స్థాయిలో ఉందని, దాంతో ఇరు దేశాలు మూడు వన్డేల సిరీస్ ఆడితే విరాళాలు సేకరించవచ్చన్నాడు.
కాగా దీనిపై టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ కపిల్ దేవ్ మాత్రం కౌంటర్ ఇచ్చాడు. ప్రస్తుత పరిస్థితుల్లో క్రికెటర్లతో రిస్క్ చేయాల్సిన అవసరం లేదంటూ అక్తర్‌కు చురకలంటించాడు. ‘భారత్-పాక్‌ల మధ్య సిరీస్ జరగాలని కోరడం అతని అభిప్రాయం. కానీ ఇక్కడ ఒక్క విషయం గుర్తుంచుకోవాలి. కరోనా కట్టడి కోసం భారత్ విరాళాలు కోసం ఇలా సిరీస్‌లు సిద్ధ కావాల్సిన అవసరం లేదు. మా దగ్గర సరిపడా డబ్బు ఉంది. .ప్రస్తుత సంక్షోభం నుంచి గట్టెక్కడం కావాలి. అది వదిలి క్రికెట్ సిరీస్‌లు ఏమిటి.? అని కౌంటర్ ఇచ్చాడు కపిల్.