Site icon TeluguMirchi.com

'షీ' కానిస్టేబులేనే వేధించి వార్తల్లోకెక్కాడు..


ఆడవారి ఫై పోకిరి గాళ్ళు చేస్తున్న నేరాలను అడ్డు కట్ట వెయ్యాలని తెలంగాణ సర్కార్ ప్రత్యేకంగా షీ బృందం ఏర్పాటు చేసారు. ఎక్కడ ఆడవారి ఫై నేరం జరిగిన షీ బృందం అక్కడికి చేరుకొని వారి తట తీస్తుంది. అంటువంటి షీ బృందం నికే షాక్ ఇచ్చాడు ఓ యువకుడు. వివరాల్లోకి వెళ్తే ..

మంచాలలోని ప్రైవేటు డిగ్రీ కాలేజీ లో చదివే విద్యార్థిని సెల్‌ఫోన్‌కు తరచూ అసభ్య సందేశాలు వచ్చేవి. ఆమె ఫిర్యాదు ఇవ్వడంతో విచారణ నిమిత్తం షీ బృందం మహిళా కానిస్టేబుల్‌ ఒకరు ఆగంతుకుడికి ఫోన్‌ చేశారు. అంతే.. ఆ ప్రబుద్ధుడు మహిళా కానిస్టేబుల్‌నే వేధించడం ప్రారంభించాడు. వేధింపులు తీవ్రమవడంతో ఆమె ఇబ్రహీంపట్నం ఠాణాలో ఫిర్యాదు చేశారు. జనవరి 23న నిందితుడిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు. పోలీసులకు చిక్కకుండా వేధింపులను కొనసాగించాడు. ఆమె ఫోన్‌ నంబరును అశ్లీల వెబ్‌సైట్‌లో నమోదు చేశాడు. బాధితురాలికి పలు ఫోన్లు రావడంతో ఆమె తీవ్ర మనోవేదనకు గురయ్యారు. కేసును తీవ్రంగా పరిగణించిన రాచకొండ షీ బృందం, ఇబ్రహీంపట్నం పోలీసులు ఎట్టకేలకు ఆగంతుకుడిని పట్టుకున్నారు.

వరంగల్‌ జిల్లా పరకాలకు చెందిన బీరం నిఖిల్‌(24)గా గుర్తించారు. ఇతను గతంలో సెక్యూరిటీ గార్డుగా పనిచేసి ప్రస్తుతం బలాదూర్‌గా తిరుగుతున్నాడని విచారణలో తేలింది. సెల్‌ఫోన్‌ను సైతం తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో తీసుకోవడంతో అతడ్ని గుర్తించేందుకు ఇన్ని రోజులు పట్టిందని పోలికలు తెలిపారు.

Exit mobile version