Site icon TeluguMirchi.com

దారుణం : 45 ఏళ్ళ కరోనా పేషెంట్ పై లైంగిక వేధింపులు

దేశంలో కామాంధులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఎన్ని కొత్త చట్టాలు వచ్చినా, పోలీసులు ఎన్నికఠిన చర్యలు చేపట్టినా వారిలో మార్పు రావడం లేదు. మృగాళ్లు చివరికి కరోనా సోకిన రోగులను కూడా వదిలి పెట్టడం లేదు. తాజాగా బీహార్‌ రాజధాని పాట్నాలో ఓ మహిళ కోవిడ్‌ సోకి ఐసీయూలో చికిత్స పొందుతోంది. 45 ఏళ్లు ఉన్న ఆ మహిళపై కొందరు లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు ఆమె కుమార్తె పోలీసులకు ఫిర్యాదు చేసింది.

కరోనా బారిన పడిన ఆ మహిళ ఇటీవల చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేరింది. ఆమెను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అయితే తన తల్లిని కొందరు లైంగికంగా వేధిస్తున్నారని పోలీసులతో కుమార్తె తెలిపింది. ఈ విషయమై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. రంగంలోకి దిగిన పోలీసులు ఆస్పత్రిలో సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.

Exit mobile version