కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని కొత్త మరియు పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వ రంగపు సంస్థ అయిన సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఈసీఐ) తన ఉద్యోగులందరికీ యోగా వర్క్‌షాప్ ఏర్పాటు చేసింది. మహమ్మారి నేపథ్యంలో రోగనిరోధక శక్తిని పెంచడం ఉద్యోగి శ్రేయస్సును మెరుగుపరచడమే ప్రధాన ప్రయెజనాలుగా ఈ యోగా కార్యక్రమం ఏర్పాటు చేయడమైంది. మేటి ఆరోగ్యం, ఒత్తిడి నిర్వహణ, ఫిట్‌నెస్ కోసం ఉద్యోగులను సమూహ కార్యకలాపాల్లో నిమగ్నం చేసే ఉద్దేశ్యంతో ప్రత్యేక ఆన్‌లైన్ యోగా సెషన్‌లు ఏర్పాటు చేశారు. సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎస్ఈసీఐ) అనేది కొత్త మరియు పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ (ఎంఎన్ఆర్ఈ) యొక్క పరిపాలనా నియంత్రణలో పని చేస్తుంది. ఇది జేఎన్ఎన్ఎస్ఎం మరియు దాని నిర్దేశిత లక్ష్యాలను చేరుకొనేలా 2011 సెప్టెంబర్ 20న ఏర్పాటు చేయబడింది. సౌర శక్తి రంగానికి అంకితమైన పని చేస్తున్న ఏకైక సీపీఎస్‌యు సంస్థ ఇది.