చెన్నైలోని అలుమిని ఆఫ్ పద్మ శేషాద్రి బాలభవన్, కేకే నగర్ బ్రాంచ్ స్కూల్ పాఠశాలలో అకౌంటెన్సీ, బిజినెస్ స్టడీస్ బోధించే రాజగోపాలన్ బుద్ధివక్రీకరించి విద్యార్ధులను లైంగికంగా వేధిస్తూ వారికి వాట్సాప్‌లో అభ్యంతరకర మెసేజ్‌లు పంపసాగాడు. లైంగిక వాంఛలతో రగిలిపోయే రాజగోపాలన్ అదే తీరుతో విద్యార్థినీ, విద్యార్దులతో ప్రవర్తించసాగాడు. టవల్‌తో ఆన్లైన్ క్లాసులకు హాజరయ్యే రాజగోపాలన్ స్టూడెంట్స్‌ను కూడా టవల్ ధరించాలని కోరేవాడని, పలువురు విద్యార్థినుల శరీరాల అందాల గురించి వాట్సాప్ మెసేజ్‌ల్లో అభ్యంతరకర వ్యాఖ్యలు చేసేవాడని పోస్టుల్లో స్పష్టం చేశారు. దీనిపై విద్యార్థినిలు తమ తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లి, ఆ తర్వాత పాఠశాల యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు.
మరోవైపు ఆరోపణలు ఎదుర్కొంటున్న టీచర్‌ను తక్షణమే విధుల నుంచి తొలగించాలని సంస్థ డీన్‌కు స్కూల్ సిబ్బంది లేఖ రాశారు. ఇక ఆఫ్‌లైన్ క్లాసుల్లోనూ రాజగోపాలన్ విద్యార్ధినుల పట్ల అసభ్యంగా వ్యవహరించేవాడని ఆరోపణలున్నాయి. విద్యార్థినులను అభ్యంతరకరంగా తాకడం, వారిపై లైంగిక వేధింపులకు గురిచేసేలా వ్యాఖ్యానిస్తాడని చెబుతున్నారు.