ఒకటే సారిడాన్ ఇక ఉండదు తలనొప్పి అని ఆ మధ్య యాడ్ తో బాగా ఫేమస్ అయ్యింది సారిడాన్ టాబ్లెట్. అయితే ఇటీవల సుప్రీంకోర్టు కొన్ని డ్రగ్స్‌ను నిషేధించిన విషయం తెలిసిందే. ఈ లిస్ట్ లో సారిడాన్ టాబ్లెట్ కూడా ఉంది. అయితే సోమవారం సుప్రీంకోర్టు ఆ జాబితాలో ఉన్నసారిడాన్‌తో సహా మరో రెండు మాత్రలపై నిషేధాన్ని ఎత్తివేసింది. ఔషధ తయారీదారులు దాఖలు చేసిన పిటిషన్‌పై స్పందిస్తూ, అత్యున్నత న్యాయస్థానం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
సెప్టెంబర్ 12న మొత్తం 328 కాంబినేషన్ డ్రగ్స్‌ను సుప్రీంకోర్టు నిషేధించింది. అందులో సారిడాన్ పెయిన్ కిల్లర్ కూడా ఉంది. కేంద్ర ఆరోగ్య శాఖ నిషేధించిన వాటిలో సారిడాన్ సహా పాన్‌డెర్మ్ స్కిన్ క్రీం, గ్లుకోనార్మ్ పీజీ అనే కాంబినేషన్ డయాబెటిస్ డ్రగ్, యాంటీ బయోటిక్ లుపీడీక్లాక్స్, యాంటీ బ్యాక్టీరియల్ ట్యాక్సిమ్ ఏజెడ్ లాంటి ఔషధాలు ఉన్నాయి.
సారిడాన్ ట్యాబ్లెట్ మాత్రకు ఏన్నో ఏళ్లుగా ప్రత్యేక గుర్తింపు ఉన్నది. శారిడాన్ మాత్రను బ్యాన్ చేయడాన్ని కొందరు నెటిజన్లు వ్యతిరేకించారు కూడా. సురక్షితం కాని ఈ ఔషధాలపై నిషేధం విధించడం కోసం ఆరోగ్య శాఖ 2016 నుంచి కసరత్తు చేస్తోంది.