Site icon TeluguMirchi.com

వీరికి చెడిందా.. !!

sania-shoyab-malikభారత టెన్నిస్‌ సంచలనం సానియా మీర్జా. ఎన్నో సంచలనం విజయాలతో.. ప్రపంచ టెన్నిస్ రంగంలో భారత్‌కు సుస్థిర స్థానాన్ని సంపాదించి పెట్టింది. సానియా నుంచి ఎంతో మంది క్రీడాకారులు స్పూరిని పొందారు. అయితే, ఇప్పుడు సానియా వైవాహిక జీవితంలో ఒడిదుడుకులు వచ్చినట్లు తెలుస్తోంది. 2010 ఏప్రిల్ 12న సానియా ప్రముఖ పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ ను పెళ్లి పెళ్లాడింది. అప్పట్లో అదో హాట్ టాపిక్.

సానియా ఏంటీ.. పాకిస్థాన్ క్రికెటర్ ను పెళ్లాడమేంటి అని చాలామంది వాపోయారు. ఇవేవి లెక్కచేయకుండా సానియా ఎంతో ఇష్టపడి షోయబ్ ను పెళ్లాడింది. తాజాగా, సోనియా-షోయబ్ ల మధ్య విబేధాలు వచ్చినట్లు సమాచారం. అందువలనే సానియా ఎక్కువగా హైదరాబాద్ లోనే వుంటుందని మీడియా కోడైకూస్తోంది. మరీ.. నిజంగానే సానియాకు షోయబ్ కు చెడిందా.. ? లేదా.. ? ఎప్పటిలాగే మీడియా పుట్టించిన పుకార్లా అని తెలియాలంటే….. టెన్నిస్ స్టార్ సానియా దీనిపై క్లారిటీ ఇవ్వాల్సిందే.. మరీ.. !

Exit mobile version