కరోనా వైరస్ కారణంగా దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న వేళ.. సాయం చేయడానికి పారిశ్రామిక వేత్తలు ముందుకొస్తున్నారు. ఇప్పటికే టాటా ట్రస్టులు, రిలయన్స్ ఇండస్ట్రీస్ తమ వంతు విరాళాలు ప్రకటించగా.. తాజాగా విప్రో కూడా భారీ విరాళం ప్రకటించింది.
విప్రో లిమిటెడ్ తరఫున రూ.100 కోట్లు, విప్రో ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ రూ.25 కోట్లు, అజీమ్ ప్రేమ్జీ ఫౌండేషన్ తరఫున రూ.1000 కోట్లు.. మొత్తంగా కరోనాను ఎదుర్కొనేందుకు రూ.1125 కోట్లు వెచ్చించనున్నట్లు తెలిపింది. అజీమ్ ప్రేమ్జీ తీసుకున్న ఈ నిర్ణయంపై ప్రసంసల జల్లు కురుస్తుంది.