క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఆస్పత్రిలో చేరారు. ఇటీవల కరోనా బారిన పడిన అతడు వైద్యుల సూచన మేరకు కొద్ది రోజులు ఆస్పత్రిలో చికిత్స పొందనున్నట్లు స్వయంగా ట్విట్టర్ లో తెలిపారు. తాను త్వరగా కోలుకోవాలని అభిమానులు చేస్తున్న ప్రార్థనలకు, వారు చూపిస్తున్నప్రేమా ఆప్యాయతలకు ధన్యవాదాలు చెప్పారు. వైద్యుల సలహా మేరకు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఆస్పత్రిలో చేరినట్లు వెల్లడించారు. కొద్ది రోజుల్లో సంపూర్ణ ఆరోగ్యంతో ఇంటికి తిరిగి వస్తానన్నారు. అలాగే ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకుంటూ సురక్షితంగా ఉండాలని ఆకాంక్షించారు. అలాగే టీం ఇండియా వరల్డ్ కప్ సాధించి 10 సంవత్సరాలైనా సందర్భంలో తనతోటి టీం మేట్స్ కి, భారతీయులందరికి శుభాకాంక్షలు తెలిపారు.