రూపీ@ 64.10

rupee-అంతర్జాతీయ మార్కెట్ లో రూపాయి విలువ రోజు రోజుకు దిగజారుతోంది. తాజాగా, రూపీ మరింత కనిష్ట స్థాయికి పడిపోయింది. ప్రస్తుతం డాలర్ తో రూపాయి విలువ రూ. 64.10 వద్ద ట్రేడవుతోంది. నిన్న రూ. 63.13 వున్న రూపాయి విలువ ఈరోజు మరో 97 పైసలు నష్టపోయి 64.10కు దిగజారింది. రూపాయి విలువ పతనం అడ్డుకోవడానికి ప్రభుత్వం, ఆర్ బీఐ చేపట్టిన దిద్దుబాటు చర్యలు పనిచేయకపోవడంతో.. ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరముందని నిపుణులు సూచిస్తున్నారు.