రూపాయికి టానిక్

rupee_dollarఅంతర్జాతీయ మార్కెట్లో రూపాయి క్షీణతను అడ్డుకోవడానికి రిజర్వ్ బ్యాంక్ ఆప్ ఇండియా (ఆర్ బిఐ) చర్యలను చేపట్టింది. డాలర్ తో రూపాయి మారకం విలువనుబలోపేతం చేయడానికి రాత్రికి రాత్రే పలు చర్యలను ప్రకటించింది. రూపీని బలోపేతం చేయడానికి బ్యాంకులకిచ్చే రుణాలపై వడ్డీరేటును ఆర్ బిఐ 2 శాతం పెంచి 10.25 శాతానికి సవరించింది. దాంతో పాటుగా ఆర్ బిఐ రూ. 12000 కోట్ల విలువైన ప్రభుత్వ సెక్యూరిటీలను ఈనెల18న విక్రయించనుంది. కాగా, రేపో రేటు మాత్రం యథాతథంగా కొనసాగుతోంది. రెపో రేటు కంటే 3 శాతం అధికంగా ఎంఎస్ ఎఫ్ రేటు ఉంటుందని రిజర్వు బ్యాంకు పేర్కొంది. గత కొద్దికాలంగా అంతర్జాతీయ మార్కెట్ లో రూపాయి విలువ దారుణంగా క్షీణిస్తోన్న విషయం తెలిసిందే. నిన్న డాలర్ తో రూపాయి మారకపు విలువ 33 పైసలు క్షీణించింది. ఈ నేపథ్యంలో ఆర్ బిఐ రంగప్రవేశం చేసి పలు చర్యలను చేపట్టింది.