పుంజుకుంటున్న ’రూపీ’.. !

rupee_dollarఅంతర్జాతీయ మార్కెట్ లో రూపాయి విలువ క్రమంగా పుంజుకుంటుంది. ఈరోజు ఆరంభంలోనే డాలర్ తో రూపాయి మారకం విలువ రూ. 59.72 పైసలుగా వుంది. తాజాగా, సెబీ, ఆర్ బీఐ చేపట్టిన దిద్దుబాటు చర్యల వలన రూపీ కోలుకుంటున్నట్లు ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్ లో రూపాయి విలువ బలపడుతుండటంతో.. స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాలతో ప్రారంభమయ్యాయి. 150 పాయింట్లకు పైగా లాభాలతో సెన్సెక్ద్, 50 పాయింట్లకు పైగా లాభాలతో నిఫ్టీ ట్రేడవుతున్నాయి.