కరోనాపై పోరులో భాగంగా పీఎం కేర్స్‌కు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ తన నియోజకవర్గ నిధుల నుంచి రూ.కోటి కేటాయించడంతోపాటు ఒక నెల వేతనాన్ని విరాళంగా ప్రకటించారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. తన పిలుపు మేరకు రాష్ట్ర భాజపా కార్యకర్తలు పీఎం కేర్స్‌కు భారీగా విరాళాలు అందించినట్లు తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఇటీవల నియమితులయ్యారు. కరీంనగర్ లో క్షేత్ర స్థాయి నుంచి ఎదిగిన నేత బండి సంజయ్. ఆయన ఆర్ఎస్ఎస్, ఏబీవీపీల్లో పనిచేశారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో పలుమార్లు కార్పొరేటర్ గా ఎన్నికయ్యారు. గత లోక్ సభ ఎలక్షన్లలో ఆయనకు కరీంనగర్ లోక్ సభ టికెట్ ఇచ్చింది. టీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ పై ఏకంగా 90 వేల ఓట్లకుపైగా మెజారిటీతో గెలిచి జెయింట్ కిల్లర్ అనిపించుకున్నారు.