Site icon TeluguMirchi.com

మరో భారత క్రికెటర్ క్రికెట్‌కు వీడ్కోలు


టీమిండియా బౌలర్ బౌలర్‌ ఆర్పీ సింగ్‌(32) క్రికెట్‌ కెరీర్ కు గుడ్‌బై చెప్పారు. యూపీకి చెందిన ఈ బౌలర్ 14 టెస్టులు, 58 వన్డేలు, 10 టీ20 మ్యాచులు ఆడాడు. టెస్టుల్లో 40, వన్డేల్లో 69, టీ20ల్లో 15 వికెట్లు తీశాడు. ఐపీఎల్‌లో 82 మ్యాచ్‌ల్లో 90 వికెట్లు తీశాడు.

అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు ఆర్పీ సింగ్‌ మంగళవారం ట్విటర్‌ ద్వారా ప్రకటించారు. తన కెరీర్ లో జరిగిన విషయాలను ఓ లేఖ ద్వారా పంచుకున్న ఆర్పీ సింగ్‌.. సరిగ్గా టీమిండియాలోకి అరంగేట్రం చేసిన రోజే (సెప్టెంబర్ 4, 2015)క్రికెట్ నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించడం విశేషం.

13 ఏళ్ల క్రితం ఇదే రోజు సెప్టెంబర్‌ 4, 2005లో మొదటిసారి టీమిండియా జెర్సీ ధరించాను. నా జీవితంలో ఇదో గొప్ప అనుభూతి. ఈ రోజు నా ఆటకు ముగింపు పలుకుతున్నాను. ఈ క్రికెట్ జర్నీలో నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్’ అని లేఖలో పేర్కొన్నాడు.

ఆర్పీ సింగ్‌ భారత జట్టు 2007 టీ20 ప్రపంచకప్‌ గెలవడంలో కీలక బాధ్యత వహించాడు. చివరగా 2016లో పూణే తరుపున ఐపీఎల్ మ్యాచ్ ఆడాడు.

Exit mobile version