Site icon TeluguMirchi.com

ఇతను ఓడిపోకుండా ఉండడం కోసం ఏమి చేసాడో తెలుసా ….


సాధారంగా మనము ఏ విధమైన పోటీలోనైనా ప్రత్యర్థి ఓటమి కోసం అన్ని విధాలా ప్రయత్నాలు చేస్తాం. ఇవి ఎక్కవగా ఎడ్ల పందాలలో , సైకిలు రేసులలో, బైకు, కారు రేసుల్లో ప్రత్యర్థులను కావాలనే కింద పడేయడం, ఢీకొట్టడంలాంటివి ఎక్కవగా చూస్తూనే ఉంటున్నాం. అయితే శాన్ మారినోలో జరిగిన మోటో2 రేస్‌లో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. తన ప్రత్యర్థి స్టెఫానో మాంజికి పక్కగా వెళ్తూ అతని బైక్‌కు బ్రేక్ వేశాడు. ఆ సమయంలో మాంజి బైక్ గంటకు 220 కిలోమీటర్ల వేగంతో ఉంది. సడెన్ బ్రేక్ వేయడంతో బైక్ కాస్త అదుపు తప్పినట్లుగా కనిపించినా, తర్వాత మాంజి వెంటనే కోలుకున్నాడు.

ఫెనాటి చేసిన ఈ పని కెమెరాలకు చిక్కింది. దీంతో 23 ల్యాప్స్ కాగానే అతన్ని రేసు నుంచి డిస్‌క్వాలిఫై చేశారు. అలాగే వచ్చే రెండు రేసుల్లో అతన్ని పాల్గొనకుండా నిషేధించినట్లు ఎఫ్‌ఐఎం మోటోజీపీ ప్యానెల్ వెల్లడించింది. తమ పరువు తీసిన ఫెనాటీని అతని టీమ్ కూడా తప్పించింది. అయితే ఈ ఘటనపై ఫెనాటి కూడా క్షమాపణ చెప్పాడు. క్రీడా ప్రపంచానికి నా క్షమాపణలు.

Exit mobile version