15 ఏళ్ల గరిష్టానికి బియ్యం ధరలు..


ప్రపంచ సరఫరాలకు సంబంధించిన ఆందోళనలతో ఆసియాలో బియ్యం ధరలు 15 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా పెరిగాయి. పొడి వాతావరణం కారణంగా థాయ్‌లాండ్‌లో బియ్యం ఉత్పత్తి గణనీయంగా పడిపోయింది. బాస్మతీయేతర తెల్ల బియ్యం ఎగుమతిపై భారతదేశం నిషేధించడంతో సరఫరాలపై ఆందోళనలు తలెత్తాయి. థాయ్ వైట్ రైస్ 5శాతం పెరిగింది. ఆసియా బెంచ్‌మార్క్ టన్ను 648డాలర్లకు పెరిగింది. ఇది అక్టోబర్ 2008 నుండి అత్యంత ఖరీదైనది.