Site icon TeluguMirchi.com

రెప్ప కాటు !

uttarakhand-floods

ఇంతటి బీభత్సమేల
గంగా యమునా !
అమ్మలాంటి వాళ్ళు కదా
మీకిది తగునా !!

శివుని జటాజూటమొదిలి
పరుగెందుకు గంగమ్మా !
బిడ్డలనే మింగేసే
నిను చూస్తే బెంగమ్మా !!

తుడిచిపెట్టి పోయాయట
మహా పుణ్య క్షేత్రాలు !
మహానదిగ మారాయట
ప్రియభారతి నేత్రాలు

నినుచూసేందుకు వచ్చిన
భక్తులకెందుకు శిక్ష !
పాపులెంతమంది లేరు
ఎందుకు నీకీ వివక్ష !!

                                            ఏవీయస్

 మరిన్ని ఉత్తినే… పొయెమ్స్ కోసం క్లిక్ చేయండి 

 

Exit mobile version