Site icon TeluguMirchi.com

Jio Tariff Plans : జియో యూజర్లకు షాక్.. భారీగా పెరిగిన రీఛార్జ్ ధరలు !


ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్‌ జియో తమ యూజర్లకు భారీ షాక్ ఇచ్చింది. జియో టారిఫ్ ప్లాన్ల ధరలు భారీగా పెంచింది. ఒక్కో ప్లాన్‌పై కనిష్ఠంగా 12.5 నుంచి గరిష్ఠంగా 25 శాతం వరకు పెంచనున్నట్లు జియో గురువారం ప్రకటించింది. దీనితో పాటు కొత్త రీఛార్జ్‌ ప్లాన్‌లను తీసుకొచ్చింది. అంతేకాదు నూతన టారిఫ్‌ అమలు నాటి నుంచి రోజుకు 2 జీబీ కంటే ఎక్కువ డేటా ఇచ్చే ప్లాన్‌లో మాత్రమే అన్‌లిమిటెడ్‌ 5జీ డేటా సౌకర్యం ఉంటుంది. కొత్త ధరలు జులై 3 నుంచి అమల్లోకి రానున్నాయి. పెరిగిన ధరలు ఈ విధంగా వున్నాయి.

Kalki 2898 AD Review | కల్కి2898 AD రివ్యూ

టారిఫ్ పెంపుతో పాటు జియోసేఫ్, జియో ట్రాన్సులేట్ అనే కొత్త సర్వీసులను జియో ప్రకటించింది. జియో సేఫ్‌ – క్వాంటం సెక్యూర్‌.. ఇది కాలింగ్‌, మెసేజింగ్‌, ఫైల్‌ బదిలీతో పాటు కమ్యూనికేషన్‌ సదుపాయాలు అందించే యాప్‌. నెలకు రూ.199 చెల్లించి ఈ సర్వీసులు పొందొచ్చు. ఇక జియో ట్రాన్స్‌లేట్‌ – ఏఐ.. ఈ యాప్‌ వాయిస్‌ కాల్‌, వాయిస్‌ మెసేజ్‌, టెక్ట్స్‌, ఇమేజ్‌లోని సమాచారాన్ని కృత్రిమ మేధతో అనువాదం చేస్తుంది. నెలకు రూ.99 కట్టి ఈ యాప్‌ సేవలు పొందొచ్చు. అయితే జియో యూజర్లకు ఈ రెండు సర్వీసులను ఏడాది పాటు ఉచితంగా ఇస్తున్నట్లు జియో పేర్కొంది.

Jani Master : అవే నిజమైతే ఇండస్ట్రీ నుండి వెళ్ళిపోతా : జానీ మాస్టర్

Exit mobile version