భారత టెలికాం రంగంలోకి సునామిలా ప్రవేశించి సంచలనాలు సృష్టించి రియన్స్ జియో అతి తక్కువ సమయంలోనే భారీగా వినియోగదారులను సొంతం చేసుకుంది. ఆరు నెలల పాటు ఉచిత ఆఫర్లు ఇచ్చి ఇతర టెలికాం ఆపరేట్లరకు చుక్కలు చూపించిన జియో ఇప్పుడు స్మార్ట్ ఫోన్‌ల రంగంలోకి అడుగు పెడుతుంది. అందుకోసం గూగుల్‌తో జత కట్టబోతుంది. ఇప్పటికే జియో, గూగుల్‌ల మద్య వ్యాపార విషయమై ఒప్పందం కుదుర్చుకున్నట్లుగా తెలుస్తోంది. గూగుల్ కొన్నాళ్లుగా ఇండియాలో అతి తక్కువ ధరకు స్మార్ట్ ఫోన్‌ను తీసుకు రావాలని ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇదే విషయాన్ని గూగుల్ సంస్థతో జియో ఒప్పందం కుదుర్చుకుని కేవలం రెండు వేల రూపాయల్లో 4జీ స్మార్ట్ ఫోన్‌లను ఇండియన్ మార్కెట్‌లో విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. తక్కువ ధరకు స్మార్ట్ ఫోన్‌లు రావడం వల్ల మరింతగా జియో వినియోగదారులు పెరుగుతారు, అదే మాదిరిగా గూగుల్‌కు కూడా ఇండియాలో మరింత ఆధరణ దక్కుతుంది. అందుకే గూగుల్, జియోల భాగస్వామ్యంతో స్మార్ట్‌ఫోన్‌లు మార్కెట్‌లోకి రానున్నాయి. వచ్చే సంవత్సరం ఆరంభంకు ఈ రెండు కంపెనీల కలయికలో స్మార్ట్ ఫోన్‌లు వచ్చే అవకాశాలున్నాయి.