ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలోని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) కీలక వడ్డీ రేట్లను మరోసారి యథాతథంగా ఉంచుతూ నిర్ణయం తీసుకుంది. 2021-22 ఆర్థికసంవత్సరంలో మొదటి పాలసీ సమీక్ష ఇది. తాజా నిర్ణయంతో రెపో రేటు 4శాతం వద్ద,రివర్స్ రెపో రేటు 3.5 శాతం వరుసగా ఐదోసారి యథాతథంగా కొనసాగనున్నాయి. ఈ మేరకు ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ బుధవారం వెల్లడించారు. రేట్లను యధాతథంగా ఉంచేందుకు మానిటరీ పాలసి కమిటీ ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుందని తెలిపారు. అయితే 2021-22లో జీడీపీ వృద్ధి 10.5 శాతంగా ఉంటుందని ఆర్‌బీఐ ఆంచనా వేసింది.