Site icon TeluguMirchi.com

కొవిడ్‌ సంబంధిత వైద్యవిభాగాలకు భారీగా నిధులు ప్రకటించిన ఆర్‌బీఐ

దేశంలో కొవిడ్‌-19 కేసులు భారీగా పెరిగిపోతుండటంతో వైద్య రంగాన్ని బలోపేతం చేయడం కోసం ఆర్‌బీఐ రంగంలోకి దిగింది. కొవిడ్‌ సంబంధిత వైద్యవిభాగాలకు నిధులను అందుబాటులోకి తెచ్చినట్లు ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తి కాంతదాస్‌ వెల్లడించారు. ఇందుకోసం రూ.50 వేలకోట్ల మేరకు ఆన్‌ట్యాప్‌ నిధులను అందుబాటులోకి తెచ్చినట్లు ప్రకటించారు. వీటికి మూడేళ్ల కాల వ్యవధి ఉంటుందని పేర్కొన్నారు. ఈ నిధులను బ్యాంకులు వ్యాక్సిన్‌ తయారీ సంస్థలకు, ఆసుపత్రుల్లో వైద్య సదుపాయాలు మెరుగు పర్చేందుకు రుణాలుగా ఇవ్వొచ్చు. ఈ రుణాలకు ప్రాధాన్యం కూడా ఇవ్వొచ్చు. ఇక చిన్న ఫైనాన్స్‌ సంస్థల కోసం రూ.10వేల కోట్ల దీర్ఘకాల రుణాలను ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆర్‌బీఐ గవర్నర్‌ వెల్లడించారు. గతంలో రుణాల రీస్ట్రక్చర్‌ను వాడుకొన్నవారు మరో రెండేళ్లపాటు మారటోరియం పొందే అవకాశం ఇచ్చారు.

Exit mobile version