టీం ఇండియాకు పలు చిరస్మరనీయ విజయాలను తెచ్చి పెట్టిన కోచ్ రవిశాస్త్రిని మరో రెండు సంవత్సరాలు కొనసాగిస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెల్సిందే. కోచ్ మార్పు ఖాయం అంటూ అంతా అనుకున్నారు. కాని చివరి నిమిషంలో కపిల్ దేవ్ నాయకత్వంలో పని చేస్తున్న క్రికెట్ సలహా కమిటీ రవిశాస్త్రికే పదవిని కట్టబెట్టడం జరిగింది. మొన్నటి వరకు అయిదు నుండి ఆరు కోట్ల సంవత్సర వేతనంతో చేసిన రవిశాస్త్రి రెండవ సారి కోచ్‌గా బాధ్యతలు చేపటిన తర్వాత భారీగా అందుకోబోతున్నాడు.
కోచ్‌గా కొత్తగా బాధ్యతలు చేపట్టిన రవిశాస్త్రితో బీసీసీఐ ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందంలో రవిశాస్త్రికి 10 కోట్లు ఇచ్చేందుకు ఒప్పుకుంటూ అగ్రిమెంట్ ఇచ్చింది. ఇంకా టీం సపోర్టింగ్ స్టాఫ్ కు కూడా భారీగానే పారితోషికాలు పెంచారు. బౌలింగ్ కోచ్ మరియు ఇతర ముఖ్య కోచ్‌లకు కోట్లలోనే పారితోషికం దక్కబోతుందని ప్రముఖ మీడియా సంస్థ ఒక కథనంలో పేర్కొంది. టీం ఇండియా ఆటగాళ్లకు కూడా భారీగానే ఫీజు ముడుతోంది.