సీతారాముల వనవాస మార్గం పునఃనిర్మించే దిశగా కేంద్రం అడుగులు

శ్రీరాముడు సీతా లక్ష్మణులతో కలిసి 14 ఏళ్ల వనవాసానికి వెళ్లిన మార్గంగా భావిస్తున్న దారిని పునర్నిర్మించాలని ప్రభుత్వం యోచిస్తోంది. అయోధ్య నుంచి చిత్రకూట్‌ వరకు 210 కిలో మీటర్ల పొడవైన ఈ మార్గం ఫైజాబాద్‌, సుల్తాన్‌పుర్‌, ప్రతాప్‌గఢ్‌ మీదుగా ఉంటుందని కేంద్ర రహదారి రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి. దీనికి ‘రాముడి వనగమన మార్గం’గా పేరు పెట్టారు.