Site icon TeluguMirchi.com

అంతరిక్షంలోకి వెళ్లిన తొలి భారతీయుడు, నేటికి 37 ఏళ్లు పూర్తి !

అంతరిక్షంలోకి వెళ్లిన తొలి భారతీయుడు రాకేశ్‌ శర్మ. మొట్టమొదటి సారిగా భారతీయుని అంతరిక్షయాత్ర కల సాకారమైంది ఈ రోజునే. రష్యా సహాకారంతో రాకేశ్‌శర్మ రోదసీలోకి వెళ్లి నేటికి 37 ఏళ్లు పూర్తి అయింది. సోవియట్‌ రష్యాకు చెందిన సోయజ్‌ టి-11 వ్యోమ నౌక ద్వారా 1984 ఏప్రిల్‌ 3 న ఆయన అంతరిక్షంలోకి వెళ్లాడు. రాకేశ్‌ శర్మ రోదసీలో సుమారు 8 రోజుల పాటు అంతరిక్షంలో గడిపారు. అంతరిక్షం నుంచి భారత్‌ ఎలా కనిపిస్తోందని అప్పటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీ అడిగిన ప్రశ్నకు రాకేశ్‌ శర్మ కవి ఇక్బాల్ రచించిన “సారే జహాన్ సే అచ్చా” (మిగతా ప్రపంచం కంటే ఉత్తమం) అంటూ సమాధానమిచ్చారు.

Exit mobile version