Site icon TeluguMirchi.com

సన్ రైజర్స్ కథ ముగిసింది !

sunrisers-hyderabad-rajasthఐపీఎల్-6 లో సన్ రైజర్స్ హైదరాబాద్ కథ ముగిసింది. సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య నిన్న రాత్రి జరిగిన ఎలిమినేషన్ II మ్యాచ్ లో రాజస్థాన్ విజేతగా నిలిచింది. దీంతో.. ఐపీఎల్-6 టోర్నిలో అనూహ్య విజయాలు సాధించి.. పటిష్ట జట్లకు సైతం షాక్ ఇచ్చిన సన్.. అస్తమించింది. మొదటి బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ 7 వికెట్లు కోల్పోయి 132 చేయగా, రాజస్థాన్ మరో 4 బంతులు మిగిలివుండగానే 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. అయితే, 57 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన రాజస్థాన్ కు బ్రాడ్ హాడ్జ్ 54 (29 బంతుల్లో) సూపర్ ఇన్నింగ్స్ తో విజయాన్ని అందించాడు.

Exit mobile version