భాగ్యనగరంలో వర్షం పడిందోచ్..!

Hyderabad-rainభానుడి ప్రతాపంతో తల్లిడిల్లిపోతున్న భాగ్యనగరం ఈరోజు వర్షంతో తడిసి ముద్దయింది. గతకొద్దిరోజులుగా ఎండతాపానికి నగరవాసులు విలవిలాడిపోయారు. ఈ సారి ఎండలు మరీ ఎక్కువగా ఉండటం.. అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన విషయం తెలిసింది. అయితే, బంగాళా ఖాతంలోని ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో..
రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. కాగా, నగరంలోని రాంకోఠి, బొగ్గుల కుంట, అబిడ్స్, కాచిగూడా చౌరస్తా, బంజారాహిల్స్ లలో చిరుజల్లులు కురిశాయి. దీంతో నగరవాసులకు ఎండల నుంచి ఉపశమనం లభించినట్లయింది. రాష్ట్రంలో అక్కడక్కడ చిరుజల్లులు కూడా కురుసే అవకాశం ఉందని వాతావరణ శాఖ
అధికారులు వెల్లడించారు.