తెలంగాణ కు వర్ష సూచనా..

రాగాల రెండు మూడు రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి వర్షాలు పడవచ్చని హైదరాబాద్ వాతావరణ శాఖా తెలియజేసింది. కోమోరిన్‌ ప్రాంతం నుంచి రాయలసీమ వరకు 0.9 కి.మీ ఎత్తు వద్ద ఉపరితల ద్రోణి ఏర్పడింది. దక్షిణ మధ్య మహారాష్ట్ర దాని పరిసర ప్రాంతాల్లో 1.5 కి.మీ ఎత్తు వద్ద ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్లు అధికారులు చెప్పుకొచ్చారు.

ఇటు రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు పెరిగాయి. గత రెండు రోజులు 38.2 డిగ్రీలు, కనిష్టంగా 24.1 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గాలిలో తేమ 58 శాతం నమోదైంది. మరో వారం రోజులపాటు పగటి ఉష్ణోగ్రతలు 37– 38 డిగ్రీల మేర నమోదయ్యే అవకాశాలున్నట్లు అంచనా వేస్తున్నారు.