‘రఫ్ఫా’డించాడు

rafaయూఎస్‌ ఓపెన్‌ : హాట్ ఫేవరేట్ గా బరిలోకి దిగిన నొవాక్ జొకోవిచ్‌ డీలా పడిపోయాడు. రఫ్ఫా ఆరడుగుల బుల్లెట్లా రెచ్చిపోయాడు. వెరసి యూఎస్‌ ఓపెన్‌ (2013) టెన్నిస్ పురుషుల సింగిల్స్‌ టైటిల్ను రఫెల్ నాదల్ సొంతం చేసుకున్నాడు. నిన్న జరిగిన సింగిల్స్ ఫైనల్‌లో నొవాక్ జొకోవిచ్‌పై రఫెల్ నాదల్‌ 6-2, 3-6, 6-4, 6-1 తేడాతో జొకోవిచ్‌ ను చిత్తు చేశాడు. దాంతో నాదల్ 13 గ్రాండ్స్లామ్ టైటిల్ను తన ఖాతాలో జమ చేసుకున్నాడు. ఈ ఏడాదిలో నాదల్కు ఇది రెండో గ్రాండ్స్లామ్ టైటిల్.