Site icon TeluguMirchi.com

ఉదయం యాదాద్రి, సాయంకాలం వేంకటాద్రిని దర్శించుకున్న పురాణపండ

ప్రముఖ రచయిత , ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖ పూర్వ గౌరవ సంపాదకులు , శ్రీశైల దేవస్థానం ప్రత్యేక సలహాదారులు పురాణపండ శ్రీనివాస్ ఈరోజు ఉదయం , సాయంకాలం ఒకేరోజు రెండు మహాక్షేత్రాల దర్శనం చేసుకున్నారు.

ఈ ఉదయం తెల్లవారుఝామువేళ తెలంగాణలోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీలక్ష్మీ నారసింహ భగవానుని , ఈ సాయంకాలవేళ ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలోని వేంకటాద్రిపై కొలువుతీరి కరుణిస్తున్న శ్రీనివాసుని ప్రత్యేక దర్శనాలు చేసుకుని … వేదపండితుల ఆశీర్వచనాలు పొందటం విశేషం.

పురాణపండ శ్రీనివాస్ అనగానే మన కన్నుల ముందు అనేక అత్యద్భుత గ్రంధాలు, అపురూపమైన సుందర భాషా సంస్కారం , విశేషమైన నిస్వార్ధ ధార్మిక సేవ, పదిమందికీ మేలు చేసే గుణం ప్రత్యక్షంగా దర్శనమిస్తాయని అనేక ఆలయాల ప్రముఖులు బాహాటంగా చెబుతుంటారు.

తిరుమల , తిరుచానూరు దర్శనానంతరం పురాణపండ తిరుమల శ్రీవారికి మొక్కుగా తలనీలాలు సమర్పించుకున్నారు.

తిరుమల వేదపాఠశాల మొదలుగా తిరుమల వేదవిశ్వవిద్యాలయం వరకూ గల అనేక వైదిక బద్ధమైన టి.టి.డి అనేక విభాగాలలో శ్రీనివాస్ గ్రంధాలకు అభిమానులు వందల సంఖ్యలో దర్శనమివ్వడం మనల్ని ఆశ్చర్యపరుస్తుంది.

Exit mobile version