Site icon TeluguMirchi.com

అన్నవరం వేదపండితుల మంగళాశీర్వచనం అందుకున్న పురాణపండ శ్రీనివాస్

Puranapanda Srinivas at Annavaram Templeఅన్నవరం : జూన్ : 2

సంప్రదాయ వైదిక విలువలు చెక్కు చెదరకుండా చాలా చాలా సౌందర్యవంతమైన భాషలో అద్భుత గ్రంథాల్ని రచిస్తూ, సంకలనీకరిస్తూ , అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో విశ్లేషణాత్మక పవిత్ర గ్రంథాల్ని ఉద్యమ స్థాయిలో ప్రచురిస్తూ వేలాది ఆలయాల్లో సంచలనం సృష్టిస్తూన్న ప్రముఖ రచయిత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధికారిక మాసపత్రిక ‘ ఆరాధన ‘ పూర్వ సంపాదకులు పురాణపండ శ్రీనివాస్ బుధవారం సాయంకాలం అన్నవరం సత్యనారాయణ స్వామి వారిని దర్శించుకున్నారు.

అనంతరం ఆలయ వేదపండితులు పురాణపండ శ్రీనివాస్ చేస్తున్న ధార్మిక గ్రంథ రచన, ప్రచురణ, ప్రచారోద్యమం అసాధారణమైందని అభినందించడమే గాక , శ్రీ సత్యదేవ వ్రత కళ్యాణమండపంలో ఆలయ వైదిక లాంఛనాలతో వేదాశీర్వచనం చేయడం విశేషం.

కార్యనిర్వహణాధికారి త్రినాధరావు ద్వారకాతిరుమల కూడా ఇంచార్జి కావడంతో అక్కడకు వెళ్లడం వల్ల … శ్రీనివాస్ కు అన్నవరం దేవస్థాన సూపరింటెండెంట్ మరియు ఆలయ సిబ్బంది ఘన స్వాగతం పలకడం ప్రత్యేకంగా పేర్కొనాలి.

Exit mobile version