Site icon TeluguMirchi.com

స్వార్ధం లేని ప్రతిభాశాలి పురాణపండ శ్రీనివాస్ వెంటపడుతున్న స్పాన్సర్స్

మంత్రాకృతి దాల్చిన శారదామూర్తి ఈయన పుస్తకాల్లో తేజరిల్లుతుందా అన్నట్లుంటాయ్ ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ అపురూప గ్రంథాలు.

ఒకటా … రెండా … ఎన్ని రకాలు, ఎన్నెన్ని మంత్ర వైభవాలు, ఎన్నెన్ని పవిత్ర సొగసులు .. ఎన్నెన్ని భారతీయ సనాతన వైభవాల వెలుగులు … ఎన్నెన్ని అద్భుత పరిమళాల భక్తి పుణ్యాల పేటికలు. ప్రతీ గ్రంధమూ అత్యంత గౌరవనీయమే. ప్రతీ గ్రంధమూ అనుష్టాన వైభవమే.

నిర్మొహమాటంగా, స్పష్టంగా , సూటిగా చెప్పుకోవాలంటే ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో ఆధ్యాత్మిక రచనల , సంకలనాల , ఉద్దండుడు పురాణపండ శ్రీనివాస్ మాత్రమేనని , వైదిక మార్గంలో నిస్వార్ధంగా ఒక యజ్ఞ భావనతో ప్రయాణిస్తున్న పురాణపండ శ్రీనివాస్ గొప్ప జ్ఞాన వైభవాలు నింపుకున్న చాలా మంచి వక్త అని , అయితే ఏ కారణం చేతనో సభలకు, సమావేశాలకు దూరంగా వుంటున్నారని, ఇకనైనా తాను అనుభూతి చెందిన మంత్ర శాస్త్ర ప్రభావాలను, ఆర్ష భారతీయ కథా వైభవాలను విస్తృతంగా సభావేదికలపై శ్రీనివాస్ తన వాగ్వైభవంతో ఆవిష్కరించాలని సీనియర్ ఐ ఏ ఎస్ అధికారి , తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక సలహాదారులు డాక్టర్ కె.వి. రమణాచారి నాలుగైదుసార్లు త్యాగరాయ గాన సభ , రవీంద్రభారతిలలో సభల్లో సైతం బాహాటంగా చెప్పడాన్ని హైదరాబాద్ మీడియా కోడైకూసిన్ది కూడా.

సరే … ఏదైతేనేం … ఈ వైకుంఠ ఏకాదశి పుణ్యవేళలో కూడా జంటనగరాల్లో అనేక వైష్ణవ ( సుమారు యాభైకి పైగా ) ఆలయాల్లో సైతం పురాణపండ శ్రీనివాస్ విష్ణు గ్రంధమే తలమానికంగా భక్తులకు అంది పరవశింపచేసి , శ్రీనివాస్ అసాధారణ కృషికి శహభాష్ అన్పించింది.

తన మార్గంలో తానే ప్రయాణిస్తారు శ్రీనివాస్. తన మనస్సుకు పట్టని అంశాన్ని ఎంతటివారు చెప్పినా వినరు.

మారుతున్న కాలాన్ని, పరిస్థితులను అనుసరించి అనుష్టానవైభవం చెక్కు చెదరకుండా నిత్య నూతన పరిణామక్రమాన్ని పవిత్రంగా పుస్తక రూపాలతో అందించడం ఒక మహాప్రతిభగా శ్రీనివాస్ కి అబ్బడం పూర్వజన్మ సుకృతమేనని సాక్షాత్తూ తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి కె.సి.ఆర్ కుమార్తె శ్రీమతి కల్వకుంట్ల కవిత గత హనుమాన్ జయంతినాడు తన సమర్పణలో పురాణపండ శ్రీనివాస్ రూపొందించిన హనుమాన్ విరాట్ గ్రంధాన్ని కొండగట్టు ఆంజనేయుడి సన్నిధానంలో కైంకర్యం చేస్తూ మాట్లాడటం పురాణపండ పాండితీ ప్రకర్షకు , ప్రజ్ఞకూ, నిర్విరామ కృషికి నిదర్శనమేనని ఒప్పుకోవాలి.

ఏదేమైనా తెలుగు రాష్ట్రాల దేవస్థానాలలో , వేలకొలది ఆలయాలలో పురాణపండ శ్రీనివాస్ అపురూప గ్రంధాల వైభవమే తొలివరుసలో కనిపిస్తోంది. నో డౌట్.

కొందరు మహా మహా పండితులు , ప్రవచనకారులు తమ ఉపన్యాసాల బయట తమ మనుషుల్ని పెట్టి బుక్స్ అమ్మించుకుంటున్న ఈరోజుల్లో సైతం ఏమీ ఆశించకుండా శ్రీనివాస్ ఇంతటి మహోత్తమ కార్యాలను భుజాలకెత్తుకోవడం ఆషామాషీ వ్యవహారం కాదు.

పురాణపండ శ్రీనివాస్ కృషిని చూసి అసూయపడుతున్న వారూ వున్నారు. శ్రీనివాస్ ఏమీ లెఖ్ఖ చెయ్యరు. తాను చేస్తున్నకార్యం మేలు చేకూర్చేదా, కాదా అనే ఆలోచిస్తారు. తన ప్రయాణంలో ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా తన గమ్యం, ధ్యేయం , ప్రయాణం భగవత్కృపకోసమే … అనేది మనకే స్పష్టంగా తెలిసిపోతుంది. ఏమీ ఆశించకుండా పవిత్రోన్ముఖంగా శ్రీనివాస్ ప్రయాణిస్తుండంవల్లనే ఎందరో స్పాన్సర్స్ పురాణపండ శ్రీనివాస్ కి అండగా నిలుస్తున్నారనేది కఠినాతి కఠినమైన సత్యం.

Exit mobile version