విశాఖపట్నం : ఏప్రిల్ : 9
శ్రీరామచంద్రుని స్తోత్రవైభవాల, వ్యాఖ్యాన ప్రాభవాల శక్తిమంతమైన అరుదైన పది అంశాలతో ప్రముఖరచయిత , శ్రీశైల దేవస్థానం పూర్వ ప్రత్యేక సలహాదారులు పురాణపండ శ్రీనివాస్ రచనాసంకలనంగా అందించిన ‘ శ్రీరామరక్ష ‘ మంత్రగ్రంధాన్ని ఒకేసారి లక్షప్రతులు ప్రచురించి విశాఖ భక్తకోటికి అంకితం చేసిన భారతీయ జనతాపార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజుపై అటు విశ్వహిందూ పరిషద్, ఆరెస్సెస్ నాయకులతోపాటు ఇటు భారతీయ జనతాపార్టీ శ్రేణులు అభినందనలు వర్షిస్తున్నాయి.
ఆదివారం శ్రీరామనవమి సందర్భంగా ముందురోజే శనివారం ప్రభాతవేళ ఈ అపూర్వఘట్టాన్ని విశాఖపట్నం భారతీయ జనతాపార్టీ కార్యాలయంలోని విశాలప్రాంగణంలో వందలాది కార్యకర్తలమధ్య, బి.జె.ఫై. శ్రేణుల మధ్య సోము వీర్రాజు లాంఛనంగా ఆవిష్కరించడం నగరంలో పరమ పవిత్రంగా సంచలనం సృష్టించింది. భారతీయ జనతాపార్టీ విశాఖ జిల్లా అధ్యక్షులు మేడపాటి రవీంద్ర ఏర్పాటుచేసిన అత్యద్భుతమైన భక్తి వాతావరణంలో ఈ కార్యక్రమం ఒక్కసారిగా పవిత్రతను విస్తరింపజేసింది.
శ్రీరామనవమి సందర్భంగా తమ కార్యకర్తలు నగరమంతా వున్న ఆలయాల్లో, సీతారాముల కళ్యాణ ఉత్సవాలలో ఈ పవిత్ర గ్రంధాన్ని లక్షమంది భక్త కోతికి ఉచితంగా అందజేస్తారని రవీంద్ర ఈ సందర్భంగా ప్రకటించారు.
ఆంజనేయస్వామి అనుగ్రహంతో … ప్రముఖరచయిత పురాణపండ శ్రీనివాస్ ప్రోత్సాహంతో ఈ మహా మంగళ కార్యాన్ని సమర్పించగలిగానని, భారతప్రధాని నరేంద్రమోడీ నాయకత్వంలో ఈ పవిత్రభారతదేశం అద్భుతాలు సాధించాలనే ఉద్దేశంతో … జాతికి శ్రీరామరక్షగా ఈ ధార్మిక గ్రంధాన్ని నిర్వహించానని చెప్పారు.
ఈ ఏర్పాట్లను ఆత్మసమర్పణాభావంతో చేసిన విశాఖ జిల్లా అధ్యక్షులు మేడపాటి రవీంద్రను అందరూ ముక్త కంఠంతో అభినందించడం విశేషం. ఈ కార్యక్రమంలో బి.జె.పి.అఫిషియల్ స్పోక్స్ పర్సన్ శ్రీమతి సుహాసిని ఆనంద్, ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్, ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి, చీపురుపల్లి మాజీ శాసన గద్దె బాబూరావు, రాష్ట్ర కార్యదర్సులు సుధాకర్ యాదవ్, శ్రీనివాసవర్మ , ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు గుడిసె దేవానంద్ , భారతీయజనతా పార్టీ యువమోర్చ రాష్ట్ర అధ్యక్షులు సురేంద్ర మోహన్ తదితరప్రముఖులు ఈ పుణ్య కార్యక్రమంలో ఆసక్తిగా పాల్గొనడం విశేషం.
సభలకు దూరంగా, దైవీయ కార్యక్రమాలను నిర్మాణాత్మకంగా ఆచరించి చూపించే విఖ్యాత ఆధ్యాత్మిక రచనా సంకలనకర్త పురాణపండ శ్రీనివాస్ ఎప్పటిలానే ఈ మహాకార్యక్రమంలో పాల్గొనకపోవడం మళ్ళీ ఆశ్చర్యకరమే . భారతీయ జనతాపార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా సోము వీర్రాజు ఈ మహోదాత్త పుణ్యకారం చెయ్యడం పార్టీ శ్రేణుల్లో బలాన్ని నింపిందనడం నిస్సందేహంగా అభినందనీయం. బెజవాడ కనకదుర్గమ్మ అనుగ్రహంతో వచ్చేనెలలో మరొక ధార్మిక గ్రంధాన్ని విజయవాడ నగర వాసులకు అంకితం చేయనున్నట్లు పార్టీ శ్రేణుల ఉవాచ