Site icon TeluguMirchi.com

మోహన్ పబ్లికేషన్స్ శ్రీమాలికకు, పురాణపండ శ్రీనివాస్ కి పుష్పగిరిపీఠం ప్రశంస.

Puranapanda Srinivas Book Sri Malika

సికింద్రాబాద్ : జులై : 11

నిష్కామ భావనతో కర్తవ్య పాలన చేసే పవిత్రమార్గాలకు ఎన్నడూ అవరోధాలు రావనడానికి ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ మంత్ర శబ్దాల అపరిమేయ వైభవమే మన కనులముందు కనిపిస్తున్న సత్యం. ప్రార్ధన కంటే గొప్ప శక్తి లేదని నిరూపిస్తున్న పురాణపండ శ్రీనివాస్ అఖండ గ్రంధాలకు తెలుగునాట ఆదరణ అనూహ్యమ్. అపూర్వమ్

భవ్యమైన దివ్యశక్తులను అక్షర అక్షయ బాండాలుగా అద్భుతంగా అందించడంలో అందెవేసిన కలంగా విశేష ఖ్యాతి గడించిన పురాణపండ శ్రీనివాస్ కళ్యాణకారకంగా
అందించిన మరో అపురూప మహాగ్రంధమే .. ‘ శ్రీమాలిక ‘ . భారత దేశంలో సనాతన ధర్మపరిరక్షణకు ఒక పవిత్ర దిక్సూచి .. పుష్పగిరి పీఠం. సకల నిగమాగమసారహృదయులైన పుష్పగిరి పీఠాధీశ్వరుల అనుగ్రహంతో ఈ సంవత్సరం అద్భుతంగా సాగుతున్న అనేక ఉత్సవాలలోవేలకొలది భక్తుల్ని ఒక సనాతన ధర్మ గ్రంధం విశేషంగా ఆకర్షించింది .

ఒక పవిత్ర సజీవానుభావాన్నిచ్చే అద్భుత గ్రంథ రచనలతో, సంకలనాలతో తెలుగు రాష్ట్రాలలో దూసుకుపోతున్న ప్రముఖ రచయిత , జ్ఞానమహాయజ్ఞ కేంద్రం సంస్థాపకులు పురాణపండ శ్రీనివాస్ అపురూప రచనా సంకలన గ్రంధం ‘ శ్రీమాలిక ” మంత్రమాలికే ఈ ఆకర్షణ. ప్రముఖ పుస్తక ప్రచురణ సంస్థ మోహన్ పబ్లికేషన్స్ నాణ్యత ప్రమాణాలతో ముద్రించి, అతి తక్కువ ధరకు అందిస్తున్న ఈ శ్రీమాలిక ‘ ఇటీవల చేస్తున్న సందడి అంతా యింతా కాదు. దక్షిణామ్నాయ పుష్పగిరి పీఠం పర్యవేక్షణలో అద్భుత మంత్ర శక్తితో దేవాలయానికి విచ్చేసిన వేలకొలది భక్తులకు త్యాగరాయగాన సభ అధ్యక్షులు కళా జనార్ధనమూర్తి ఈ రెండువందల యాభై పేజీల ఈ మహోన్నత గ్రంధాన్ని సద్భక్తితో అందించడంతో భక్తుల సంతోషానికి అవధులు లేవనే చెప్పాలి.

మహాగ్రంధాల సమర్ధకార్యాన్ని తెలుగు రాష్ట్రాలలో పురాణపండ శ్రీనివాస్ ఒక్కరే చేయగలరని తిరుమల , ఇంద్రకీలాద్రి, శ్రీశైలం కొండగట్టు, యాదాద్రి, వేములవాడ, జోగులాంబ దేవస్థానాల పండితులతో పాటు కళా జనార్ధన మూర్తి కూడా స్పష్టంగా చెప్పేసారు. ఎంతటి మహాగ్రంధాన్నైనా సరే కేవలం రోజుల్లోనే కార్యరూపం దాల్పించి , పవిత్రంగా … నిస్వార్ధంగా అందించడమనేది పురాణపండ శ్రీనివాస్ వల్లనే సాధ్యమౌతోందని, , ఇది మామూలు విషయం కాదని , పురాణపండ శ్రీనివాస్ పై జ్ఞాన సరస్వతీదేవి విశేష అనుగ్రహం వర్షించడం వల్లనే సాధ్యమౌతోందని చెప్పడం విశేషం. అందువల్లనే … ఎన్నో అఖండ గ్రంధాలతో లక్షలకొలది భక్త పాఠకుల్ని ఆకర్శించి నిస్వార్ధ సేవలో తెలుగు రాష్ట్రాలలో అగ్రస్థానంలో వున్నారు పురాణపండ శ్రీనివాస్ .

శ్రీనివాస్ రచనా వ్యాఖ్యానాల్లో వుండే అందమైన ధ్వనికి, నిగూఢ కోణాలకి వేలకొలది అభిమానులున్నారనేది నిర్వివాదాంశం. ఇన్ని వందల గ్రంధాలను సహృదయంతో పంచుతున్న కళా జనార్ధన మూర్తి సహృదయానికి పుష్పగిరి పీఠాధీశ్వరులు మంగళా శాసనం చేశారు. ఈ గ్రంథ లావణ్యాన్ని, పురాణపండ శ్రీనివాస్ పవిత్ర ప్రతిభను ప్రశంసించారు. ఈ ఆలయంలో వైభవోపేతంగా జరిగిన ఉత్సవాలకు హాజరైన కేంద్ర హోమ్ శాఖామంత్రి మంత్రి కిషన్ రెడ్డి, , తెలంగాణ ముఖ్యమంత్రి కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక సలహాదారులు కే. వి. రమణాచారి, భారత మాజీ ప్రధాని పీ.వి. నరసింహారావు కుమార్తె అయిన ఎమ్మెల్సీ శ్రీమతి సురభి వాణీదేవి , జస్టిస్ రామలింగేశ్వర రావు , తెలంగాణ బెవెరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ దేవీప్రసాద్ , మాజీ స్పీకర్ మధుసూదనాచారి, వంశీ ఆర్ట్ థియేటర్స్ చైర్మన్ వంశీ రామరాజు తదితర ప్రముఖులకు అమ్మవారి ప్రసాదంగా ఈ మంగళ గ్రంధాన్ని బహూకరించడం విశేషం.

ఇక్కడ మాత్రమే కాకుండా … పురాణపండ శ్రీనివాస్ శ్రీమాలిక పుస్తకాల్ని త్యాగరాయగాన సభలో జరిగే అనేక ప్రత్యేక విశేష సాహిత్య, సాంస్కృతిక ఉత్సవాలలో కూడా కళా జనార్ధన మూర్తి ఈ గ్రంధాన్ని విస్తృతంగా పంచుతున్నారు. శనివారం రాత్రి జరిగిన ప్రఖ్యాతగాయని పి. సుశీల అభినందన సభలో వందలకొలది రసజ్ఞుల మధ్య కూడా పూజార్హనీయమైన జ్ఞాపికగా ‘ శ్రీమాలిక ” గ్రంధాన్ని జనార్ధనమూర్తి స్వయంగా అందజేయడం విశేషం .

మరొక ముఖ్యాంశమేమంటే సికింద్రాబాద్ లో ఇటీవల వందలకొలది వేదవిద్యార్థులకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఒక శ్రీవైష్ణవ వైదిక కార్యక్రమంలో ఇండియన్ బ్యాంకు ఉన్నతోద్యోగి మద్దులపల్లి సత్యకుమార్ ఈ ‘ శ్రీమాలిక ‘ మంగళ మంత్ర సంపదను ప్రత్యేకంగా పునర్ముద్రణ చేయించి సుమారు వందమందికి పైగా తానే స్వయంగా వినయంగా వారికి అందజేయడం మరొక ప్రత్యేకాంశంగానే పేర్కొనాలి. ఈ అంశాన్ని మరొక వార్తావిశేషంలో త్వరలో ముచ్చటిస్తాము.

విఖ్యాత ధార్మికవేత్త చాగంటి కోటేశ్వర రావు, పద్మశ్రీ గరికపాటి నరసింహా రావు వంటి మహా ప్రతిభాసంపన్నులు సైతం పురాణపండ శ్రీమాలికకు ఆశీర్బలాన్ని అందివ్వడం మరొక ప్రశంసార్హపు అంశంగానే చెప్పాలి. నిజానికి … నిఖార్సుగా చెప్పాల్సిన ముఖ్యాంశం ఏమంటే పురాణపండ శ్రీనివాస్ బుక్స్ ఏనాడూ అస్సలు వ్యాపార కాలుష్యాన్ని పులుముకోక పోవడంవల్లనే లక్షలాది పాఠకుల పూజాపీఠాల్లో పవిత్రంగా, పరమ శోభాయమానంగా వెలుగులు విరజిమ్ముతున్నాయి. ఈసారి రాజమహేంద్రవరానికి చెందిన మోహన్ పబ్లికేషన్స్ ఈ బుక్ ముద్రణకు పూనుకోవడం, ఆచరించి భక్త్లకు ప్రయోజనం కలిగించడం అభినందనీయమని భక్త పాఠకలోకం గొంతెత్తి చెబుతోంది. మహా గ్రంధాలతో సుదర్శన చక్రాల్లా దూసుకు పోతున్న పురాణపండ శ్రీనివాస్ ఎప్పటిలానే ఈ కార్యక్రమాలకు దూరంగా వున్నారు. అంటే … ఈ సభలకు , సమావేశాలకు హాజరుకాలేదు.

Exit mobile version