బాలుకి ప్రేమతో ‘ స్వర వేడుకలో పురాణపండ శ్రీనివాస్ స్పీచ్ అదుర్స్


ఈ శనివారం హైదరాబాద్ లోని రవీంద్ర భారతి పులకించిపోయింది. తెలుగు సినీ మ్యూజిషియన్స్ అకాడెమి సమర్పణలో తెలంగాణ ప్రభుత్వ సాంస్కృతిక శాఖ సౌజన్యంతో ప్రఖ్యాత గాయకుడు ‘ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకి ప్రేమతో ‘ పేరిట పన్నెండు గంటలపాటు నిర్విరామంగా జరిగిన ‘ వందమంది గాయనీ గాయకుల అపురూప స్వరాల పాటల పరిమళంతో పరవశించిపోయింది.

ప్రముఖ గాయకులు సునీత, ఆర్ఫీ పట్నాయక్ , రఘు కుంచె , రేవంత్, విజయలక్ష్మి, గీత మాధురి, రామాచారి, రమ్య బెహరా, దామిని , కౌసల్య, శ్రీలేఖ , రాహుల్ సిప్లిగంజ్ , మంగ్లీ వంటి ప్రఖ్యాత గాయకుల మరియు గాయనీమణులు ప్రధాన కార్యవర్గ సభ్యులుగా ఏర్పడ్డ ఈ తెలుగు సినీ మ్యూజిషియన్స్ అకాడెమి వీరందరి ఆధ్వర్యంలో ఘనంగా బాలుకి స్వరార్చన జరిగింది.

ఈ కార్యక్రమంలో ప్రధాన అతిధులుగా ప్రఖ్యాత నటులు తనికెళ్ళ భరణి, హీరో సుమన్, నటుడు ఉత్తేజ్, ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ , తెలంగాణ సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ తదితర ప్రముఖులు పాల్గొనగా … రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధికారిక మాసపత్రిక ఆరాధన పూర్వ సంపాదకులు పురాణపండ శ్రీనివాస్ స్పీచ్ అదిరిపోయిందనే చెప్పాలి.

పురాణపండ శ్రీనివాస్ మాట్లాడిన నాల్గుమాటలైనా ఆడిటోరియంలో వేలాదిమందిచే ఒన్సమోర్ కొట్టించడం సభికుల్ని ఉత్తేజ పరిచింది.

సాధారణంగా పురాణపండ శ్రీనివాస్ అనగానే ఒత్తైన రింగుల జుత్తూ, గంభీరంగా సాగే నడక, అద్భుతమైన వాక్పటిమ … అన్నీ మనకు తెలుసున్నవే. అయితే ఈనాటి సభకు శ్రీనివాస్ కొంచం జుత్తుతో పాల్గొనడం వెనుక తిరుమల వెళ్లి తలనీలాలు సమర్పించారనేది స్పష్టంగా తెలుస్తోంది.

శ్రీనివాస్ ని సభావేదికపైకి ప్రముఖ గాయకులు శ్రీభారతి సంస్థ వ్యవస్థాపకులు చింతలపాటి సురేష్ తీసుకొస్తుండగా … ప్రఖ్యాత గాయని విజయలక్ష్మి పురాణపండ శ్రీనివాస్ గురించి చెప్పిన అపూర్వమైన మాటల్లో శ్రీనివాస్ మేధ … కీర్తికి దూరంగా వుండే సహకార గుణం … గర్వంలేని వాగ్వైభవం, ప్రామాణిక రచనా ప్రాభవం, అసాధారణ రీతిలో గ్రంథ నిర్మాణం ఇవన్నీ విన్న ఆడియన్స్ శ్రీనివాస్ పై చూపిన ప్రేమపూర్వక చప్పట్లతో ఆడిటోయం మార్మ్రోగిపోయింది.

సాయంకాలం జరిగిన సభలో తెలంగాణ సాంస్కృతిక శాఖామంత్రి శ్రీనివాస్ గౌడ్ ఈ సంస్థకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రోత్సాహం ఎప్పుడూ ఉంటుందని … ఇందరు సంగీత ప్రముఖుల మధ్య మాట్లాడటం అదృష్టంగా భావిస్తున్నామని చెప్పడంతో సభ ముగిసింది.

బాలుగారి పాటల జ్ఞాపకాలతో వేలాది ప్రేక్షకులు తడిసిముద్దవ్వడం ఇటీవలి కాలంలో ఇదే ఒక అద్భుతమని సంగీత ప్రియులు ఆనందంతో ఓలలాడారు.