Site icon TeluguMirchi.com

శ్రీనివాస్, లలితాబ్రాండ్ రైస్ సత్యప్రసాద్ కు కంచి కామాక్షి అనుగ్రహం


మానవ జీవనవిధానానికి, సమాజ సంస్కృతులకు ఉపయోగపడే విశేషాలెన్నింటినో చక్కగా వివరించే పరమ రమణీయగ్రంథాలెన్నింటినో రచించి, సంకలనీకరించి, ప్రచురించి లక్షల తెలుగు వాకిళ్ళలో తానే ఒక శోభాయమాన మహాగ్రంధంగా నిలిచిన ప్రముఖ రచయిత, శ్రీశైల దేవస్థానం పూర్వ ప్రత్యేక సలహాదారులు పురాణపండ శ్రీనివాస్ ఒక్క సారిగా RRR తో , KGF – 2 మహా చిత్రాలతో కోట్లాది భారతీయుల్ని ఆకర్షించారు.

పన్నెండు చిత్రాలకు దర్శకత్వం వహించి , అన్ని సినిమాలూ ఘన విజయాలు సాధించేలా చేసి , ఈ దేశప్రేక్షక లోకానికి ఎదురులేని దర్శక ధీరుడిలా విజయాలపతాకమై వెలుగుతున్న ఎస్సెస్ రాజమౌళి సంచలనాత్మక దృశ్యకావ్యం RRR చిత్రం ప్రత్యేక కృతజ్ఞతలు ప్రకటించింది ఒకే ఒక వ్యక్తి ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ కి మాత్రమే ! శ్రీనివాస్ ఫోటో పెట్టి మరీ కృతజ్ఞతలు చెప్పారు రాజమౌళి.

రాజమహేంద్రవరానికి చెందిన ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ పేరు ఇప్పుడు దేశమంతటా ఈ రెండు మహా చిత్రాలతో ఇంకా మారుమ్రోగిన విషయం ప్రక్కకు పెడితే …శ్రీనివాస్ మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా నిరాడంబరంగా అలానే దైవబలంతో మంత్రబలాలను తెలుగు లోగిళ్ళకు సమర్పిస్తూనే వున్నారు. ఇలాంటి పవిత్ర మనస్తత్వానికి ప్రేక్షకలోకం , పాఠక లోకం హాట్స్ ఆఫ్ చెబుతోంది.

ఈ అంశంలోంచి చూసినప్పుడు ఇప్పుడు ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ అపురూప మహాగ్రంధాన్ని కాంచీపురం యతీంద్రులు , కంచికామకోటి పీఠాధిపతులు శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామీజీ పవిత్రతల మధ్య ఆవిష్కరించి … మంగళాశాసనాలు చేయడంతో పండిత, పీఠాధి పతుల, అర్చక లోకం దృష్టి ఒక్క సారిగా శ్రీనివాస్ వైపు మళ్లింది.

విఖ్యాత ఆధ్యాత్మిక వేత్త చాగంటి కోటేశ్వర రావుగారి పరమ సంప్రదాయ గోశాల విశాల మహా ప్రాంగణంలో అద్భుత దైవీయ యజ్ఞ యాగాది క్రతువులతో, అఖండ కుంకుమార్చనలతో తాను తరిస్తూ , లక్షల మందిని తరింపచేసిన విజయేంద్ర సరస్వతి , తరువాయి క్రమంలో పిఠాపురం, మండపేట , రాజమహేంద్రవరంలలో అద్భుత కార్యాలను కంచి సంప్రదాయాలనుసారం నిర్వహించి ఆకట్టుకున్నారు. అనుగ్రహించారు. ఈ కార్యక్రమాలలో చాగంటి కోటేశ్వర రావు, శ్రీపీఠాధిపతి పరిపూర్ణానంద , శాంతాబయోటెక్ అధినేత వరప్రసాదరెడ్డి తో పాటు పలువురు సినీ ప్రముఖులు, రాజాకీయ ప్రముఖులు, మంత్రులు, న్యాయమూర్తులు పాల్గొని స్వామీజీ ఆశీర్వచనం స్వీకరించడం విశేషం.

ఇవ్వన్నీ ఒక ఎత్తు అయితే … పురాణపండ శ్రీనివాస్ బుక్ స్వామి వారిని విశేషంగా ఆకరించిందనేది అక్కడి శిష్యులు, అనుచరగణం, మీడియా సాక్షిగా చెబుతున్న సత్యం.

దైవకార్యం తప్ప శ్రీనివాస్ ఏదీ పట్టించుకోరు. ఎందులోనూ రాజీ పడరు. ఎవరినీ ఇబ్బంది పెట్టడం శ్రీనివాస్కి ఇష్టం ఉండదు. చాలామందికి దూరంగా వుంటారు. మీడియా పిచ్చికి కూడా చాలా దూరంగా వుంటారు. మరీ ముఖ్యంగా స్వార్ధ ప్రయోజనాలకోసం తహ తహ లాడేవారు ఎంతటివారినైనా శ్రీనివాస్ తన దగ్గరికి రానివ్వరు. వీలైనంతవరకూ తానే సహకారం చెయ్యడానికి శ్రీనివాస్ ప్రయత్నిస్తారు. దైవకార్యం తప్ప మరే ఇతర కార్యం ఎవ్వరు అడిగినా చెయ్యరు గాక చెయ్యరు. వాళ్లకి దైవం విలువ తెలుస్తుందని ఊరుకుంటారు. భౌతిక ప్రమాణాలపట్ల, భౌతిక అంశాల పట్ల శ్రీనివాస్ అస్సలు ఆసక్తి చూపరు. ఆయన దైవబలంతో, మనోబలంతో సాగిపోతారు.

అయితే విఖ్యాత వ్యాపారవేత్తలు , లలితబ్రాండ్ రైస్ అధినేతలు మట్టే సత్య ప్రసాద్, మట్టే శ్రీనివాస్ లు సమర్పకులుగా ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ చేత పరమాద్భుతంగా రూపొందింప చేసిన ఈ బుక్ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారే స్వయంగా ఆవిష్కరించి రచయిత శ్రీనివాస్ పై మంత్రమయంగా మంగళాశాసనం చేయడమే కాకుండా, గ్రంథ సమర్పకులు మట్టే ప్రసాద్ ని ప్రత్యేకంగా అభినందించారు.

తెలుగునాట ఈ మంత్ర గ్రంధం ఒక అద్భుత వైదిక మంగళ ద్వారమని స్వామీజీ ప్రసన్నంగా సెలవిచ్చారు.

సుమారు మూడువందల పేజీలతో అలరారుతున్న ‘ శ్రీమాలిక ” అనే ఈ ఉత్తమ గ్రంధం శ్రీనివాస్ జీవన సౌందర్యంలో ఇరవై ఐదవ ప్రచురణ కావడం మరొక విశేషం. శ్రీనివాస్ ధార్మిక గ్రంథ సేవ అప్రతిహతంగా కొనసాగడం లక్షల భక్తుల్ని ఆశ్చర్యపరుస్తోంది.

ఈ గ్రంధాన్ని ఎన్నో దేవాలయాలకు, వేదపాఠశాలలకు అందితే మట్టే ప్రసాద్ కృషి సఫలమయినట్లే. కంచి కామాక్షి తల్లి అనుగ్రహమే శ్రీనివాస్ కి, మట్టే సత్య ప్రసాద్ కి కచ్చితంగా లభించిందని పలువురు ప్రముఖులు ఈ సందర్భంలో పేర్కొనడం నిజమే. అంతా కామాక్షీ దయ.

Exit mobile version